అసంతృప్తితో చిరంజీవి .. మళ్లీ వాళ్లను రంగంలోకి దింపారట!

  • 'సైరా'లో మార్పులు కోరిన చిరూ 
  • రంగంలోకి దిగిన పరుచూరి బ్రదర్స్ 
  • ఫిబ్రవరి 2వ వారం నుంచి రెండవ షెడ్యూల్     
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఫస్టు షెడ్యూల్ చేసిన తరువాత చిరంజీవి అసంతృప్తితో ఉన్నారనీ, అందుకే తదుపరి షెడ్యూల్ ఆలస్యమవుతోందనే టాక్ వినిపిస్తోంది. ఇది నిజమేనన్నట్టుగా ఇప్పుడు మరో వార్త షికారు చేస్తోంది.

ఈ సినిమా కథ విషయంలో మూలం దెబ్బతినకుండా అక్కడక్కడా మార్పులు చేస్తే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నారట. అలాగే సంభాషణలు కూడా తన పాత్ర స్థాయికి తగినట్టుగా లేవని ఆయనకి అనిపించిందట. దాంతో పరుచూరి బ్రదర్స్ ను .. సాయిమాధవ్ బుర్రాను మళ్లీ రంగంలోకి దింపినట్టు సమాచారం. ప్రస్తుతం వాళ్లు చిరూ సూచనల మేరకు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఫిబ్రవరి 2వ వారం నుంచి ఈ సినిమా రెండవ షెడ్యూల్ మొదలుకానుంది.   
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News