క్రిప్టో కరెన్సీ సంబంధ ప్రకటనలపై నిషేధం విధించనున్న ఫేస్బుక్
- గతంలో వర్చువల్ కరెన్సీకి సానుకూలంగా స్పందించిన సోషల్ మీడియా దిగ్గజం
- ఇన్స్టాగ్రాం సహా అన్ని మాధ్యమాల్లో నిషేధం
- ప్రకటించిన ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగం
ఈ మేరకు కొత్త పాలసీ విధానాలను ఫేస్బుక్ రూపొందించింది. క్రిప్టో కరెన్సీలను ప్రచారం చేస్తూ వచ్చే అన్ని రకాల ఆర్థిక ప్రకటనలు, తప్పుదోవ పట్టించే పోస్టులపై నిషేధం విధించబోతున్నట్లు ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ రాబ్ లీథర్న్ తెలిపారు.