Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జాతీయ రహదారిపై ల్యాండ్ అయిన విమానం.. ఆశ్చర్యపోయిన స్థానికులు

  • ఇంజిన్‌ ఫెయిల్‌ అవడంతో చాకచక్యంగా ల్యాండ్‌ చేసిన పైలట్
  • అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో హైవేపై దించుతున్న‌ట్లు ముందుగానే చెప్పిన పైలట్
  • అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘటన
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విమానం వాహనాల మధ్యకు వచ్చి హైవేపై ల్యాండ్ అయింది. దీంతో స్థానికులంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంజిన్‌ ఫెయిల్‌ అవడంతో ఇద్దరు ప్రయాణికులతో వెళుతున్న ఓ చిన్న విమానాన్ని పైలట్‌ చాకచక్యంగా రహదారిపై ల్యాండ్‌ చేశాడని అక్క‌డి అధికారులు ఈ ఘ‌ట‌నపై వివ‌ర‌ణ ఇచ్చారు.

ఆ విమానం శాండియాగో నుంచి వ్యాన్‌నూస్‌కు వెళుతోంద‌ని, ఇంజ‌న్ ఫెయిల్ కావ‌డంతో కోస్టా మెసాలోని 55 ఫ్రీవే హైవేపై ల్యాండ్ చేశాడ‌ని తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డ‌డంతో తాను హైవేపై విమానాన్ని దించుతున్న‌ట్లు పైల‌ట్‌ ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ముందే సమాచారం అందించాడ‌ని అధికారులు చెప్పారు. స‌ద‌రు జాతీయరహదారిపై ట్రాఫిక్‌ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

airplane
america
pilot

More Telugu News