Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంఎక్స్ ప్లేయ‌ర్‌కి ప్ర‌త్యామ్నాయం... స్నాప్ వీడియో ప్లేయ‌ర్‌

  • మంచి రివ్యూలు ఇస్తున్న వినియోగ‌దారులు
  • ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మాత్ర‌మే
  • అన్ని ఫార్మ‌ట్ల వీడియోలు, ఆడియోలు ప్లే చేసుకునే అవ‌కాశం
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో వీడియోలు ప్లే చేసుకోవ‌డానికి ఉప‌యోగించే యాప్‌ల‌లో ఎంఎక్స్ ప్లేయ‌ర్ మొద‌టిస్థానంలో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్ని వీడియో ప్లేయ‌ర్లు అందుబాటులో ఉన్నప్ప‌టికీ దానికి ఉన్న ఆద‌ర‌ణ ప్ర‌త్యేకం. ఇప్ప‌టి వ‌రకు దాన్ని మించే యాప్ లేద‌నేది వినియోగ‌దారుల అభిప్రాయం. కానీ ఇటీవ‌ల ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్షమైన ఓ యాప్ మాత్రం ఎంఎక్స్ ప్లేయ‌ర్‌ని భ‌ర్తీ చేసేలా క‌నిపిస్తోంది. దాని పేరు స్నాప్ వీడియో ప్లేయ‌ర్‌.

ఎంఎక్స్ ప్లేయ‌ర్‌లో ఉన్న ఫీచ‌ర్ల‌తో పాటు త‌క్కువ ప్ర‌క‌ట‌న‌ల‌తో మంచి వీడియో అవుట్‌పుట్‌ను ఈ యాప్ ద్వారా ప్లే చేసుకోవ‌చ్చ‌ని వినియోగ‌దారులు రివ్యూలు ఇస్తున్నారు. మొబియుస్పేస్ అనే కంపెనీ ఈ యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ 4.2 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లలో ఈ యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది. స్నాప్ వీడియో ప్లేయర్ యాప్ అన్ని రకాల వీడియో, ఆడియో ఫార్మాట్స్‌లో ఉన్న ఫైల్స్‌ను సులభంగా ప్లే చేస్తుంది. 3gp, asf, flv, m4v, mkv, mov, mp4, mpeg, vob, rmvb తదితర ఫార్మాట్స్‌లో ఉన్న వీడియోలను ఈ యాప్ ప్లే చేయగలదు. అలాగే ఇందులో పవర్‌ఫుల్ ఈక్వలైజర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో అద్భుతమైన సౌండ్ ఔట్‌పుట్‌ను పొందవచ్చు.
mx player
snap video
player
android

More Telugu News