Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి తెగ ఇబ్బంది పెట్టేస్తోందట !

  • సూర్య సరసన సాయిపల్లవి
  • షూటింగుకి రావడంలో ఆలస్యం 
  • ఇబ్బందిపడిపోతోన్న యూనిట్    
తెలుగులో చేసిన 'ఫిదా' సినిమా సాయిపల్లవికి ఒక రేంజ్ లో క్రేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోను ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. నటనలోను .. డాన్స్ లోను అదరగొట్టేస్తోన్న సాయిపల్లవి ప్రస్తుతం తమిళంలో సూర్య జోడీగా ఒక సినిమా చేస్తోంది.

తన అభిమాన హీరో సరసన ఇంత త్వరగా ఛాన్స్ తగులుతుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆ మధ్య సాయిపల్లవి చెప్పింది. అలాంటి సాయిపల్లవి ఈ సినిమా షూటింగుకి ఆలస్యంగా వస్తూ, అందరినీ ఇబ్బంది పెట్టేస్తోందట. షూటింగ్ స్పాట్ లోను ఆమె వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' షూటింగ్ సమయంలోను సాయిపల్లవిపై ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇప్పుడు సూర్య సినిమాలోనూ అదే తంతు. ఆమెపై జరుగుతోన్న ఈ ప్రచారంలో నిజమెంతనేది సాయిపల్లవినే చెప్పాలి.    
surya
sai pallavi

More Telugu News