గేల్, రూట్, ఆమ్లా, గుప్తిల్... వీరిని కొనేవారేరి?

  • ఐపీఎల్ 11వ సీజన్ వేలం మొదలు
  • అమ్ముడు పోని పలువురు ఆటగాళ్లు
  • నేడు కూడా కొనసాగనున్న వేలం ప్రక్రియ
విధ్వంసకర బ్యాట్స్ మెన్ గా, ముఖ్యంగా టీ-20 క్రికెట్ లో అతి తక్కువ బంతుల్లోనే అత్యధిక పరుగులు సాధించే వీరుడిగా పేరున్న వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ను, ఐపీఎల్ 11వ సీజన్ లో తమ టీములో చేర్చుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తిని చూపలేదు. ఒక్క గేల్ మాత్రమే కాదు... హషీమ్ ఆమ్లా, గుప్తిల్, ఫాల్కనర్, రూట్, విజయ్ వంటి ఎంతో మంది ప్రముఖ క్రికెటర్లు కూడా అమ్ముడు పోలేదు.

శనివారం నాడు ఐపీఎల్ 11వ సీజన్ నిమిత్తం ఆటగాళ్ల వేలాన్ని ప్రారంభించగా, దాదాపు 300 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. మొత్తం 1000 మందికి పైగా ఆటగాళ్లు వేలంలో పాల్గొనేందుకు సంతకాలు చేశారు. ఇక నేడు రెండో రోజు ఆటగాళ్ల వేలం కొనసాగనుండగా, నిన్న అమ్ముడు పోని ఆటగాళ్ల కనీస ధరను తగ్గించి నేడు వేలం వేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Chris Gale
Amla
IPL
T-20

More Telugu News