Maharashtra: అర్ధరాత్రి కొల్హాపూర్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. శాశ్వతనిద్రలోకి చేరిన 13 మంది!

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్ అదుపు తప్పి పంచగంగ నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి బస్సు శివాజీ బ్రిడ్జిపైకి చేరుకున్న తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నదిలో బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు.

పుణెలోని బలెవాడికి చెందిన ప్రయాణికులు గణ‌్ పతిపులె నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దారినపోయే ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Maharashtra
mini-bus
Kolhapur
Panchganga

More Telugu News