తెరచుకోని లింక్.. ఆగిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెరచుకోని లింక్.. ఆగిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'!

  • బఫర్ కావడానికి ఎక్కువ సమయం
  • వీక్షకుల సహనానికి పరీక్ష
  • అధిక ట్రాఫిక్ కారణంగానేనన్న రాంగోపాల్ వర్మ
ఈ ఉదయం నెట్లో విడుదలైన రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని వీక్షించాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. జీఎస్టీ లింక్ ఎంతకీ తెరచుకోకపోతుండగా, బఫర్ కావడానికి ఎక్కువ సమయం పడుతూ వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ప్రస్తావించిన రాంగోపాల్ వర్మ, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతున్నందున, అప్ గ్రేడ్ చేసే నిమిత్తం ఆపినట్టు వెల్లడించాడు.

కొంత సమయం తరువాత లింక్స్ తెరచుకుంటాయని చెప్పాడు. అప్ డేట్ చేసిన తరువాత విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని అన్నాడు. అభిమానుల ఆత్రుతకు తగ్గట్టుగా అధికమంది ఒకేసారి వీక్షించేందుకు 'స్ట్రయిక్ ఫోర్స్' ఏర్పాట్లు చేస్తోందని చెప్పాడు. ఇక ఈ సినిమాను మంచి క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్, స్పీకర్లతో వినాలని, కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని, ఆయన సంగీతం మియా మాల్కోవా అందమంత బలమైనదని వ్యాఖ్యానించాడు.
GST
God S*x and Truth
Ramgopal Varma

More Telugu News