కుడిభుజాన్ని కోల్పోయి, కన్నీరు మున్నీరైన కోమటిరెడ్డి
- కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య
- పథకం ప్రకారం హత్య చేశారన్న కోమటిరెడ్డి
- రాజకీయ నేతల హస్తం ఉందని ఆరోపణ
శ్రీనివాస్ హత్యకు కుట్ర జరుగుతోందని పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు పట్టించుకోలేదని ఆరోపించారు. ఓ పథకం ప్రకారం ఈ హత్య జరిగిందని, ఈ ఘటన వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని అన్నారు. ఓ వ్యక్తిని ఒంటరిని చేసి చంపడం పిరికి చర్యని నిప్పులు చెరిగారు. హత్య వెనక ఉన్నవారు ఎవరైనా వారిని చట్టం ముందు నిలపాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.