పవన్ కల్యాణ్ ఖమ్మం వెళుతూ మధ్యలో అలా ఆగాడో లేదో... అంతే.. జనం చుట్టుముట్టారు!
- ఈ ఉదయం కొత్తగూడెం నుంచి ఖమ్మంకు బయలుదేరిన పవన్
- మధ్యలో దంతాలపల్లి శివార్లలో ఆగిన జనసేనాని
- ఆ వెంటనే చుట్టుముట్టిన అభిమానులు
ఆ వెంటనే చుట్టు పక్కల ఉన్నవారు పవన్ ను చూడగానే పరుగులు తీస్తూ వచ్చారు. పవన్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపగా, వారితో పవన్ కాసేపు మాట్లాడి సెల్ఫీలకు పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ యువకుడు పవన్ తో మాట్లాడుతూ, తెలంగాణలో మీకు భారీగా అభిమానులు ఉన్నారని చెప్పడంతో చిరునవ్వు నవ్వారు. తమ ఫేవరెట్ హీరో అక్కడున్నాడన్న సంభ్రమాశ్చర్యాల నుంచి వారు తేరుకోకముందే, అక్కడ జనాలు పోగవుతుండటంతో పవన్ కల్యాణ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు.