కొత్తగూడెం చేరుకున్న పవన్ కల్యాణ్.. రేపు ఉదయమే ఖమ్మం పయనం

జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈ రోజు కరీంనగర్ లోని శుభమ్ గార్డెన్స్ లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన విషయం తెలిసిందే. రేపు ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల అభిమానులతో సమావేశం కానున్నారు. అందుకోసం కరీంనగర్ నుంచి పవన్ కల్యాణ్ కొత్తగూడెం చేరుకున్నారు. కొత్త గూడెంలో పవన్ కల్యాణ్‌కు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి సింగరేణి అతిథి గృహంలో పవన్‌ బస చేస్తున్నారు. రేపు ఉదయమే కొత్తగూడెం నుంచి ఖమ్మంలోని ఎంబీ గార్డెన్‌కు ప్రదర్శనగా వెళతారు. 


More Telugu News