Chandrababu Naidu: రామరాజ్య స్థాపనకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu conveys Sri Rama Navami greetings
షార్ట్స్‌లో చూడండి
రేపు (మార్చి 27) శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మానికి, సుపరిపాలనకు శ్రీరామచంద్రుడు ప్రతీక అని కొనియాడారు. ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడైన శ్రీరాముడు అవతరించిన, ఆయన కల్యాణం జరిగిన పవిత్రమైన రోజే శ్రీరామనవమి అని చంద్రబాబు వివరించారు.

ఈ సందర్భంగా ఆయన ఒక సందేశం విడుదల చేశారు. శ్రీరాముడు అంటేనే ప్రజారంజక పాలన అని, రామరాజ్యాన్ని స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. శ్రీరామచంద్రమూర్తి చూపిన బాటలో పయనిస్తూ, ఆయన సుగుణాలతో ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.

ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీరాముడి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
AP CM
Andhra Pradesh
Sri Rama Navami
Ramajayam
Hindu Festival
Rama Rajya
Good Governance

More Telugu News