ఆ అంశాన్ని పవన్ కల్యాణ్ విజ్ఞతకే వదిలివేస్తున్నాను: వీహెచ్‌

తెలంగాణలో కేసీఆర్ నియంతలా పాలన కొనసాగిస్తోంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఆ పాలన బాగుందని అంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అప్పట్లో కేసీఆర్‌పై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మాత్రం ఆయనను పొగుడుతున్నారని, ఈ అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని వీహెచ్‌ అన్నారు. పవన్‌కు దళితులంటే కూడా ఎవరో తెలియదని ఎద్దేవా చేశారు. ఇక్కడ కేసీఆర్‌కి, అక్కడ చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఓ తొత్తుగా ఉన్నట్లు తెలుస్తోందని విమర్శించారు.


More Telugu News