హాలీవుడ్ చిత్రంలో న‌టిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ సోద‌రుడు అమ‌న్‌

సోద‌రి ర‌కుల్ ప్రీత్ సింగ్ భార‌తీయ చిత్రసీమ‌లో రాణిస్తుంటే.. సోద‌రుడు అమ‌న్ సింగ్ ఏకంగా హాలీవుడ్ మీదే క‌న్నేశాడు. అంతేకాదు.. ఇప్ప‌టికే ఓ ఆంగ్ల చిత్రంలో కూడా న‌టిస్తున్నాడు. 'సెడిష‌న్' అనే ఆంగ్ల చిత్రంలో ర‌కుల్ సోద‌రుడు అమ‌న్ సీఐఏ ఏజెంట్ పాత్ర‌లో నటిస్తున్నాడ‌ట‌. గతేడాది 'రాక్‌ ఎన్‌ రోల్‌' అనే లఘు చిత్రంతో అమన్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ ల‌ఘుచిత్రం ప్ర‌మోష‌న్ కోసం ర‌కుల్ చాలా స‌హాయం చేసింది.

ఇక అమ‌న్ న‌టిస్తున్న ఆంగ్ల చిత్రం హిందీలో కూడా విడుద‌ల‌వ‌నుంది. పలువురు భారతీయ నటులు కూడా ఇందులో క‌నిపించ‌బోతున్నట్లు స‌మాచారం. సమ్మర్‌ బోధి నిక్స్‌, జోయెల్‌ మరాక్కోలు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలో విడుదల కాబోతోంది. ఎలాగూ న‌ట‌న‌లో ప్ర‌వేశం ఉంది కాబ‌ట్టి త్వరలో తెలుగులో కూడా అమన్‌ నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
hollywood
rakul preet singh
aman preet singh

More Telugu News