Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా ఏఎస్పీతో అక్రమ సంబంధం ఎఫెక్ట్... విచారణ తరువాత సీఐ సస్పెన్షన్!

  • నిన్న అడ్డంగా దొరికిపోయిన కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డి
  • ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు
  • మహిళా ఏఎస్పీ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు
ఏసీబీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్పీతో అక్రమ సంబంధం పెట్టుకుని, నిన్న ఆమె భర్తకు అడ్డంగా దొరికిపోయిన కల్వకుర్తి సీఐ మల్లికార్జునరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏఎస్పీ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరం, మల్లికార్జునరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అంతకుముందు ఏఎస్పీ స్టేట్ మెంట్ ను కూడా కేపీహెచ్బీ పోలీసులు రికార్డు చేశారు. ఆమె తన ఇష్టపూర్వకంగానే సీఐతో ఉన్నట్టు తెలియజేసిందని పోలీసు వర్గాల సమాచారం. కాగా, ఆమెను తాను వివాహం చేసుకోవాలని భావిస్తున్నానని, విడాకులు వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటామని ఉన్నతాధికారుల ముందు మల్లికార్జునరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది.
ACB ASP
Kalwakurti CI

More Telugu News