కాలేజీలో మహిళా ప్రిన్సిపాల్ ను తుపాకీతో కాల్చి చంపిన విద్యార్థి

  • హర్యానాలో దారుణ ఘ‌ట‌న 
  • విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్
  • ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన 12వ తరగతి విద్యార్థి 
హర్యానాలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. యమునా నగర్‌లోని తాపేర్ కాల‌నీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి తమ మహిళా ప్రిన్సిపాల్ ను తుపాకీతో కాల్చి చంపాడు. కాలేజీకి వచ్చేటప్పుడే తన వెంట తుపాకీ తెచ్చుకున్న సదరు విద్యార్థి.. ప్రిన్సిపాల్ రితా చబ్రాపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆమె తన ఆఫీస్‌లో ఉండగా అక్కడకు వెళ్లి మరీ ఆ విద్యార్థి కాల్చి చంపాడని సమాచారం.

ఆమెపై కాల్పులు జరిపి పారిపోయిన సదరు విద్యార్థి అనంతరం తనకు తానుగా వచ్చి పోలీసులకి లొంగిపోయాడు. రితా చబ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రితా చబ్రా తనను తిట్టిన కారణంగానే ఆమెను ఆ విద్యార్థి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ విద్యార్థి వద్దకు ఆ తుపాకీ ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. 

student
killed
principal
haryana

More Telugu News