ఎనిమిదేళ్లలోపు చిన్నారులు, వృద్ధులకు పాస్పోర్టు ఛార్జీల్లో 10 శాతం రాయితీ!
- కారైకల్ లో పోస్టాఫీసులో పాస్ పోర్టు కేంద్రాన్ని (పీవోపీఎస్కే) ప్రారంభించిన సుష్మా స్వరాజ్
- ఇప్పటికే 60 పీవోపీఎస్కే కేంద్రాల ఏర్పాటు
- దేశవ్యాప్తంగా 236 పీవోపీఎస్కే కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు
దేశవ్యాప్తంగా 236 పీవోపీఎస్కే కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, ఇప్పటికే 60 కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2017లో 19శాతం అధికంగా పాస్ పోర్టు అప్లికేషన్ల ప్రొసెసింగ్ జరిగిందని ఆమె తెలిపారు. కరైకల్ లో ప్రారంభించిన పీవోపీఎస్కే కేంద్రం ద్వారా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాలు ఈ సేవలు పొందుతాయని ఆమె చెప్పారు.