చాక్లెట్‌ రంగును బట్టి ఎఫెక్టు ఉంటుందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాక్లెట్‌ రంగును బట్టి ఎఫెక్టు ఉంటుందా?

చాక్లెట్‌ తీయగా ఉంటుంది. మనకు తెలిసింది అంతవరకే అయితే నల్లగా ఉండే చాక్లెట్‌ నోటికి తీయదనంతో పాటూ.. మనసుకు ప్రశాంతత కూడా కలిగిస్తుందని... తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి నల్లని చాక్లెట్‌ ఉపకరిస్తుందిట. అందులో ఉండే పాలిఫెనాల్స్‌ అనే రసాయనం ప్రశాంతతను, తృప్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కల్లో ఉండే పాలి ఫెనాల్స్‌ మన ఆహారంలో సహజసిద్ధంగా ఉంటుంది. ఈ రసాయనలు ఆక్సిడేటివ్‌గా పనిచేసి ఒత్తిడి తగ్గిస్తాయట.

మానసికంగా అనేక దుష్ప్రభావాల్ని ఇవి దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ విషయం కనుగొనక ముందునుంచి కూడా... భావోద్వేగాల్ని నియంత్రించడంలో చాక్లెట్‌కు కొంత పాత్ర ఉన్నట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో చాక్లెట్‌ మానవ సంబంధాల విషయంలో ఎంత కీలకమో చెప్పే ప్రకటనలు కూడా మహ క్రియేటివ్‌గా రూపొందుతున్నాయి. అయితే స్విన్‌బర్నే టెక్నికల్‌ యూనివర్సిటీకి చెందిన మేథ్యూ పేస్‌ ఈ కొత్త విషయాన్ని కూడా జత కలిపారు.

More Telugu News