వెలుగులోకి వచ్చిన మహా అద్భుత గుహలు!
- అతిపెద్ద గుహలను కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్తలు
- ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవిగా గుర్తింపు
- తాజా గుహల్లో వేల ఏళ్లనాటి శిలాజాలు లభ్యం
ఈ పురాతన గుహలు 347 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ గుహలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ గుహల్లో వేల ఏళ్లనాటి శిలాజాలు లభించాయి. వీటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. మాయన్ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ గుహలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గుహలు 1500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండవచ్చని మరో శాస్త్రవేత్త అంచనా వేస్తున్నారు.