పద్మావత్ సినిమాపై ఆందోళన.. థియేటర్ల వద్ద విధ్వంసం ప్రారంభం
- విడుదలకు సిద్ధమైన బాలీవుడ్ సినిమా 'పద్మావత్'
- తీవ్ర పరిణామాలుంటాయని ఇప్పటికే హెచ్చరించిన రాజ్‌పుత్‌లు
- 'పద్మావత్' విడుదల కానున్న థియేటర్ ముందు ఆందోళన
- బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన
ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని హెచ్చరించిన ఆందోళనకారులు తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని ఓ థియేటర్ వద్ద రచ్చ రచ్చ చేశారు. ఈ నెల 25 నుంచి ఆ సినిమాను ఈ థియేటర్లో ప్రదర్శిస్తోన్న నేపథ్యంలో ఆందోళనకారులు అక్కడి పోస్టర్లను చించేస్తూ, పలు కటౌట్లను ధ్వంసం చేశారు.