చంద్రబాబు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లకపోవడానికి కారణమిదే: నారా లోకేష్

  • కలెక్టర్ల కాన్ఫరెన్స్ వల్లే హైదరాబాద్ వెళ్లలేకపోయారు
  • అమరావతిలోనే వర్ధంతిని నిర్వహించారు
  • మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళి అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ ఘాట్ కు రాలేక పోయారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్నందునే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లలేకపోయారని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించామని... చంద్రబాబు కూడా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. దీనికి తోడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని తెలిపారు. తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు.
Go Back to Shorts
chandrababu
nara lokesh
ntr

More Telugu News