పవన్ ఆఫీస్ నుంచి బోయపాటికి ఫోన్ కాల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ ఆఫీస్ నుంచి బోయపాటికి ఫోన్ కాల్!

  • చరణ్ తో బోయపాటి తాజా చిత్రం 
  • ఆయనపై దృష్టి పెట్టిన పవన్ 
  • నెక్స్ట్ మూవీ ఆయనతో చేయాలని నిర్ణయం
  • కబురు వెళ్లిందంటూ టాక్  
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అజ్ఞాతవాసి' చేసిన పవన్ కల్యాణ్, ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు. అందువలన సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. రాజకీయ నేపథ్యం కలిగిన చిత్రమైతే రెండు విధాలుగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్.

తాను అనుకుంటున్న తరహా కథకి బోయపాటి అయితే బాగుంటుందని పవన్ భావించాడని అంటున్నారు. ఆల్రెడీ పవన్ ఆఫీస్ నుంచి బోయపాటికి ఫోన్ వెళ్లిందని చెబుతున్నారు. బోయపాటికి పవన్ అపాయింట్ మెంట్ కూడా ఖరారు అయిందని అంటున్నారు. మాస్ యాక్షన్ మూవీలకు పెట్టింది పేరైన బోయపాటి .. పవన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి మరి. చరణ్ తో సినిమా మొదలుపెడుతుండగానే .. పవన్ నుంచి ఫోన్ రావడంతో, బోయపాటి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడట. 
pavan
boyapati

More Telugu News