Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అడల్ట్ స్టార్ తో వర్మ సినిమాకు కీరవాణి సంగీతం!

  • మియా మల్కోవా ప్రధాన పాత్రలో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'
  • జనవరి 26న విడుదల కానున్న అడల్ట్ మూవీ
  • కీరవాణి చక్కటి సంగీతాన్ని అందించారని కితాబిచ్చిన వర్మ
ప్రముఖ పోర్న స్టార్ మియా మల్కోవా ప్రధాన పాత్రలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' సినిమా ట్రైలర్ విడుదలై నెట్టింట దూసుకు వెళుతుండగా, ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారట.

ఇక దాదాపు పాతికేళ్ల క్రితం వెంకటేష్, శ్రీదేవి జంటగా, వర్మ రూపొందించిన 'క్షణక్షణం' చిత్రానికి కీరవాణి మ్యూజిక్ చేశారు. ఆపై వర్మ, కీరవాణి కలసి పనిచేయడం ఇదే తొలిసారి. దీని గురించి వర్మ చెబుతూ, ఈ సినిమాకు అనేక అవార్డులను పొందిన ప్రసిద్ధ దర్శకుడు కీరవాణి స్వరాలను అందించారని, కీరవాణి సంగీతం మియా మల్కోవా శృంగారంలో నాణ్యతను పెంచడంతో పాటు ఆమె భావ ప్రకటనను మరింత శక్తిమంతం చేసిందని అన్నాడు. అద్భుతమైన 'బాహుబలి', ఆధ్యాత్మికత నిండిన 'అన్నమయ్య'కు సంగీతాన్ని అందించిన కీరవాణి శృంగారం విషయంలోనూ అంతే నిబద్ధతను చూపించారని కొనియాడాడు. కాగా, ఈ చిత్రం జనవరి 26న ఉదయం 9 గంటలకు ఇంటర్నెట్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
God S*x and Truth
Ramgopal Varma
Keeravaani
Porn Star

More Telugu News