చంద్రబాబే క్షమాపణలు చెప్పారు.. పవన్ చెప్పలేడా? బాబు కంటే పవన్ గొప్పోడా?: విరుచుకుపడిన కత్తి మహేశ్
- క్షమాపణలు చెప్పేందుకు పవన్‌కు ఉన్న అడ్డేంటి?
- నా హక్కులకు భంగం కలిగింది కాబట్టి వదిలిపెట్టబోను
- ప్రశ్నించకూడనంత గొప్పోడా పవన్?
- కత్తి మహేశ్ తీవ్ర విమర్శలు
పవన్ ఫ్యాన్స్‌తో జరుగుతున్న వివాదం తన ప్రాథమిక హక్కులకు సంబంధించినదని, అందుకే దీనిని విడిచిపెట్టడం లేదని కత్తి స్పష్టం చేశాడు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్.. ఇలా మనం ఎవరి గురించైనా మాట్లాడొచ్చని, కానీ పవన్ గురించి మాట్లాడితే మాత్రం దాడి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అంటే పవన్ అంత గొప్పోడా?’ అని ప్రశ్నించాడు. ప్రజాస్వామ్యానికి ఇది ఎంతమాత్రమూ మంచిది కాదని అన్నాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, అందరిదీ అని కత్తి మహేశ్ పేర్కొన్నాడు.