చీఫ్ జస్టిస్ ముందు కన్నీరు పెట్టిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా!
- న్యాయమూర్తి లోయా మృతి కేసులో తనను శంకిస్తున్నారని ఆవేదన
- తాను ఎంతో కష్టపడి పని చేస్తున్నానని వ్యాఖ్య
- అరుణ్ మిశ్రాను ఓదార్చిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ చలమేశ్వర్
తనకు గతంలో ఉన్న సీజేఐలు టీఎస్ ఠాకూర్, జేఎస్ ఖేహార్ కూడా చాలా క్లిష్టమైన కేసులను అప్పగించారని తెలిపారు. అరుణ్ మిశ్రా కంటతడి పెట్టడంతో దీపక్ మిశ్రాతో పాటు అక్కడే ఉన్న జస్టిస్ చలమేశ్వర్ కూడా ఆయనను ఓదార్చారు. అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అంశాలను తాము లేవనెత్తామేకానీ, ఎవరికీ వ్యతిరేకం కాదని జస్టిస్ చలమేశ్వర్ అన్నారట.