సెంచూరియన్‌ టెస్టుకి వర్షం అడ్డంకి!

  • రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు 68/2 (23.5 ఓవర్లు)
  • క్రీజులో ఎల్గర్ (29), డెవిల్లియర్స్ (35)
  • తొలి ఇన్సింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు 335
  • తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు 307
దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాటింగ్ కొనసాగిస్తుండగా వర్షం అడ్డుపడింది. రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 68 పరుగులతో క్రీజులో ఉండగా వర్షం పడడంతో అంతరాయం కలిగింది. ఆట నిలిచే సమయానికి భారత్‌పై 96 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా ఉంది. మార్కమ్ 1, ఆమ్లా 1 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే అవుట్ అయ్యారు. క్రీజులో ఎల్గర్ 29, డెవిల్లియర్స్ 35 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రాకి రెండు వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా స్కోరు 68/2 (23.5 ఓవర్లు) గా ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేయగా, టీమిండియా 307 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News