భోగి మంటలతో ఉత్సాహంగా మొదలైన సంక్రాంతి సంబరాలు... పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, సినీ నటులు!
- రైతుల చేతికి పంట
- ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు
- ఉత్సాహంగా పాల్గొన్న నేతలు
పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతాల్లో నిర్వహించిన సంబరాల్లో వారు పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వీధుల్లోకి వచ్చి భోగి మంటలు వేసి ఉత్సాహంగా గడిపారు. భోగి వేడుకలు అంబరాన్ని అంటుతున్న వేళ, మంటల చుట్టూ కోలాటాలు ఆడుతూ పండక్కి స్వాగతం పలికారు. పలువురు ఏపీ మంత్రులు భోగి మంటల ముందు చిన్నారులను కూర్చోబెట్టి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు.