south africa: తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. అర్ధ సెంచరీ చేసిన మార్క్‌రమ్

దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచులో మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ విసిరిన బంతికి మురళీ విజయ్‌కు క్యాచ్ ఇచ్చుకుని ఓపెనర్ డీన్ ఎల్గర్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరో ఓపెనర్ మార్క్‌రమ్ ధాటిగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మార్క్‌రమ్ 63, హషిమ్ ఆమ్లా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్కోరు 97/1 (35 ఓవర్లకి) గా ఉంది.
south africa
India
Cricket

More Telugu News