పెళ్లి చేసుకున్న ప్రేమికులను వెంబ‌డించిన బంధువులు.. ప్రేమజంటకు సాయం చేసిన వ్య‌క్తి మృతి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి చేసుకున్న ప్రేమికులను వెంబ‌డించిన బంధువులు.. ప్రేమజంటకు సాయం చేసిన వ్య‌క్తి మృతి!

  • ఖమ్మం జిల్లా గోపాలపురం వద్ద ఘటన
  • భద్రాచలంలో పెళ్లి చేసుకున్న త‌రుణ్‌, సుమ
  • విషయం తెలుసుకుని వాహనాల్లో వెంటాడిన సుమ తరఫు బంధువులు
  • కారులో పారిపోతూ ప్రమాదం.. తరుణ్ పరిస్థితి విషమం
ప్రేమ జంటను బంధువులు వెంబడించడంతో వారికి సాయం చేసిన‌ ఒక‌రు మృతి చెందిన ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లందు పట్టణానికి చెందిన త‌రుణ్‌, సుమ కొంత కాలంగా ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. తమ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోర‌ని భావించి, ఈ రోజు ఉదయం భద్రాచలంలో పెళ్లి చేసుకున్నారు.

ఈ విష‌యం తెలుసుకున్న యువ‌తి తరఫు బంధువులు సినిమా ఫక్కీలో పలు వాహనాల్లో వారి వ‌ద్ద‌కు చేరుకున్నారు. దీంతో ప్రేమజంట కారులో పారిపోవాల‌ని చూసింది. ఈ క్ర‌మంలో కారును న‌డుపుతోన్న ఓ యువ‌కుడు అతి వేగంగా దాన్ని డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో ఖమ్మం గోపాలపురం వద్ద అది ఒక్క‌సారిగా అదుపు తప్పి బోల్తా ప‌డింది. దీంతో ఆ యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ త‌రుణ్‌, సుమ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. తరుణ్‌ పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలిసింది.
lovers
escaped
khammam
car accident

More Telugu News