సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- సుప్రీంకోర్టులో పరిస్థితి సజావుగా లేదని న్యాయమూర్తులు మీడియా ముందుకు
- ఈ విషయం న్యాయవ్యవస్థ అంతర్గత వ్యవహారం- కేంద్ర ప్రభుత్వం
- సుప్రీంకోర్టులో ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు
- ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలి
సుప్రీంకోర్టులో ఈ పరిణామం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకానికి ముప్పు వాటిల్లేలా ఉందని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని న్యాయమూర్తులకు కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ సుప్రీంకోర్టు పరిపాలనా వ్యవహారాల్లో పరిస్థితులను తక్షణం సరిదిద్దాలని, లేకపోతే దేశ ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే.