నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ40!
- నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ40
- శ్రీహరికోట నుంచి ప్రయోగం
- 31 శాటిలైట్లను మోసుకెళ్తున్న రాకెట్
భారత ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 ఈఆర్ ఉంది. ఈ ఉపగ్రహం సహాయంతో తుపాన్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం 1323 కిలోల బరువును ఉపగ్రహవాహక నౌక తనతో పాటు తీసుకెళుతోంది. కార్టోశాట్-2 ఉపగ్రహం బరువు 710 కిలోలు. ప్రస్తుతం పీఎస్ఎల్వీ మూడవ దశ విజయవంతంగా ముగిసింది. రాకెట్ తన లక్ష్యం దిశగా దూసుకెళుతోంది.