Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా పెద్దన్నయ్యకి నేను ఫాదర్ గా నటించడమే విచిత్రం: కోట శంకర్ రావు

  • చిన్నప్పుడే స్టేజ్ ఎక్కాను 
  • మా పెద్దన్నయ్యకి ఒక నాటక సంస్థ ఉండేది
  • అన్నయ్యలతో కలిసి నాటకాలు వేశాను
కోట శంకర్ రావుకి నటుడిగా మంచి పేరుంది. పలు నాటకాలు .. సినిమాలు .. సీరియల్స్ లో ఆయన నటించి మెప్పించారు. అలాంటి కోట శంకర్ రావు .. తాజాగా తెలుగు పాప్యులర్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చారు. "చిన్నప్పుడు మా టీచర్లు నాటకం వేసినప్పుడు .. ఓ ఖైదీగా కనిపించడం కోసం మొదటిసారిగా స్టేజ్ ఎక్కాను" అన్నారు.

"మా పెద్దన్నయ్య కోట నరసింహారావుకి ఓ నాటక సంస్థ ఉండేది. ఆయన .. మా రెండవ అన్నయ్య కోట శ్రీనివాసరావు .. నేను .. మరికొందరు మిత్రులం కలిసి 'పుణ్యవతి' అనే నాటకాన్ని దాదాపు 200 మార్లు ప్రదర్శించాం. మా పెద్దన్నయ్య .. ఆయన స్నేహితుడు హీరోలుగా నటించేవారు. ఇక రెండవ అన్నయ్య శ్రీనివాసరావు విలన్ గా చేసేవాడు. నేను మాత్రం మా పెద్దన్నయ్యకి తండ్రి వేషం వేసేవాడిని .. అదే విచిత్రం" అంటూ చెప్పుకొచ్చారు.
kota shankar rao

More Telugu News