భోపాల్ రైల్వే స్టేషన్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్... దేశంలో మొదటిసారి
- రూ. 5కే ఒక శానిటరీ నాప్కిన్
- 'హ్యాపీ నారి' పేరుతో ప్రారంభం
- ప్రారంభించిన తొమ్మిది గంటల్లోనే 600 నాప్కిన్ల అమ్మకం
ఏర్పాటు చేసిన తొమ్మిది గంటల్లోనే 600 నాప్కిన్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒక్క మెషీన్లో 75 నాప్కిన్లు ఉంటాయి. శిక్షణ పొందిన మహిళా ఉద్యోగి వీటిలో నాప్కిన్లను నింపుతారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రయత్నం గురించి ప్రచారం కల్పించడానికి రైళ్లలో, ప్లాట్‌ఫాంల మీద ప్రచార బోర్డులు కూడా పెట్టినట్లు ఆయన చెప్పారు.