అమెరికా యువతిని పెళ్లి చేసుకున్నా అక్కడి పౌరసత్వాన్ని కోల్పోయిన ఎన్నారై!
- తప్పుడు మార్గాల్లో యూఎస్ లో అడుగుపెట్టిన ఎన్నారై
- వెనక్కి పంపించేయాలన్న కోర్టు
- అక్కడి యువతిని పెళ్లాడి, పౌరసత్వం పొందిన ఎన్నారై
ఈ క్రమంలో, గత శుక్రవారం న్యూజెర్సీలోని ఫెడరల్ జడ్జి కీలక తీర్పును వెలువరించారు. బల్జీందర్ సింగ్ నేచురలైజేషన్ ను ఉపసంహరించుకోవచ్చంటూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ, తప్పుడు మార్గాల ద్వారా అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వారికి, ఇప్పటికే పొందినవారికి ఇది ఒక హెచ్చరిక అని అన్నారు. ఇలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని చెప్పారు. ఫ్రాన్సిస్ ను ట్రంప్ ప్రభుత్వం నియమించింది. దీనిపై స్పందించిన జస్టిస్ డిపార్ట్ మెంట్... ఇది తొలి డీన్యూట్రలైజేషన్ కేసు అని తెలిపింది.