అనుష్క 'భాగమతి' ట్రైలర్ గురించి ప్రభాస్ స్పందన
- స్వీటీని పొగడ్తలతో ముంచెత్తిన బాహుబలి
- కష్టపడేతత్వం, అంకితభావం ఉన్నాయని వ్యాఖ్య
- సినిమా విజయం సాధించాలని ఆకాంక్ష
'భాగమతి' చిత్ర ట్రైలర్ సోమవారం విడుదలైంది. విడుదలైన మూడు గంటల్లోనే 20 లక్షలకుపైగా వీక్షణలు వచ్చాయి. గతంలో 'భాగమతి' టీజర్ విడుదలైనప్పుడు కూడా ప్రభాస్.. అనుష్కపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.