ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా

  • దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తొలిటెస్టు
  • ప్రస్తుతం టీమిండియా స్కోరు 66/3 (20 ఓవర్లకి)
  • క్రీజులో విరాట్ కోహ్లీ (23), రోహిత్ శర్మ(9)
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 286 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 209 పరుగులు చేసిన నేపథ్యంలో విజయానికి 208 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా, స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు విజయ్ మురళీ, శిఖర్ ధావన్ కొద్ది సేపటికే అవుటయ్యారు. విజయ్ మురళీ 13 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 16 పరుగులు చేయగా మరో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పుజారా 4 పరుగులకే అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 23, రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 66/3 (20 ఓవర్లకి) గా ఉంది. 
Go Back to Shorts
India
south africa
Cricket

More Telugu News