ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతకు ఘోర అవమానం... మెడలో చెప్పుల దండ.. ఫోటో చూడండి!
- స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దినేశ్ శర్మ
- చెప్పులను దండగా వేసిన ఓటర్
- నీటి సమస్యను పరిష్కరించనందుకే ఈ సత్కారమట
తొలుత చెప్పులను పక్కకు పడేసేందుకు ప్రయత్నించిన శర్మ, ఆ వక్తి తన ప్రయత్నాన్ని మానకపోవడంతో దండ వేయించుకోవాల్సి వచ్చింది. ఆపై ఆయన మాట్లాడుతూ, తాను ప్రజల బిడ్డనని, తన నుంచి వారు ఏదో కోరుకుంటూ, తమలోని అసంతృప్తిని ఇలా వెల్లడించాడని చెప్పడం గమనార్హం. ఇక తాగు నీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను తెచ్చిన వ్యక్తి వ్యాఖ్యానించాడు.