ఉత్తరాది నగరాల్లో ల్యాండింగ్ వీలు లేక... శంషాబాద్ ఎయిర్ పోర్టుకు క్యూ కట్టిన విదేశీ విమానాలు!
- ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు
- కనీసం 25 మీటర్లు కూడా లేని విజబిలిటీ
- పలు అంతర్జాతీయ విమానాలు దారి మళ్లింపు
అయితే, ముంబై ఎయిర్ పోర్టు అత్యంత బిజీగా ఉండటంతో, పలు విమానాలు హైదరాబాద్ కు వచ్చాయి. దుబాయ్ - ఢిల్లీ - బంగ్లాదేశ్, సింగపూర్ - ఢిల్లీ, జెడ్డా - లక్నో, సౌదీ అరేబియా - ఢిల్లీ విమానాలు శంషాబాద్ లో ల్యాండ్ అయ్యాయి. మరికొన్ని విమానాలను కూడా హైదరాబాద్ కు మళ్లించినట్టు తెలుస్తోంది. ఉత్తరాదిలో పొగమంచు తగ్గిన తరువాత తిరిగి ఈ విమానాలు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు.