విమానంలో భార్యతో ప్రయాణిస్తూ.. మరో అమ్మాయిపై లైంగిక వేధింపులు.. భారతీయుడికి అమెరికా పోలీసుల అరదండాలు
- పక్క సీటులో కూర్చున్న యువతిని వేధించిన వ్యక్తి
- డెట్రాయిట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయమూర్తి
విమానం డెట్రాయిట్లో ల్యాండ్ అవగానే అప్పటికే కాచుక్కూర్చున్న పోలీసులు రామమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మిచిగాన్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కోర్టులో రామమూర్తి మరోలా వాదన వినిపించాడు. తాను నిద్రమాత్ర వేసుకుని గాఢ నిద్రలోకి జారుకున్నానని, ఫిర్యాదు చేసిన యువతే తన మోకాళ్లపై పడుకుందని కోర్టుకు తెలియజేశాడు. అయితే అతడి వాదనను న్యాయమూర్తి విశ్వసించలేదు. నిందితుడికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో రామమూర్తిని జైలుకు తరలించారు.