286 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్!

  • దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మొదటి టెస్టు
  • డివిలియర్స్ 65, డుప్లెసిస్ 62, డికాక్ 43 పరుగులు
  • భువనేశ్వర్ కుమార్‌కి 4 వికెట్లు
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టులో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 73.1 ఓవర్ల వద్ద 286 పరుగులకి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్‌లో డీన్ ఎల్గర్ 0, మార్క్‌రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23, కేశవ్ మహారాజ్ 35, రబాడా 26, స్టెయిన్ 16, మార్కెల్ 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా, రవి చంద్రన్ అశ్విన్ 2 తీశాడు. షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి. 
Go Back to Shorts
india
south africa
Cricket

More Telugu News