Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ కు చుక్కెదురు.. పోలీసులపై కోర్టు ఆగ్రహం!

  • బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
  • వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామన్న పోలీసులు
  • అనుమతి లేకుండా ఎలా పంపుతారంటూ కోర్టు ఆగ్రహం
లైంగిక వేధింపుల కేసులో రిమాండ్ లో ఉన్న కళాకారుడు గజల్ శ్రీనివాస్ కు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం అతను పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మరోవైపు పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గజల్ శ్రీనివాస్ కు సంబంధించిన వీడియో సీడీలను తమ అనుమతి లేకుండా ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎలా పంపుతారని ప్రశ్నించింది. సీడీలను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోపక్క, కేసులో ఏ2 నిందితురాలిగా ఉన్న పార్వతి పరారీలో ఉందని ఈ సందర్భంగా కోర్టుకు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మీడియాకు పార్వతి ఇంటర్వ్యూలు ఇస్తుంటే... ఆమె పరారీలో ఉంది అని చెబుతారా? అంటూ నిలదీసింది. 
gajal srinivas
nampally court

More Telugu News