'ల‌య‌న్' ఫేం దేవ్ ప‌టేల్‌ స‌ర‌స‌న రాధికా ఆప్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ల‌య‌న్' ఫేం దేవ్ ప‌టేల్‌ స‌ర‌స‌న రాధికా ఆప్టే!

  • దేవ్ ప‌టేల్‌తో ఓ చిత్రంలో న‌టించనున్న రాధిక
  • త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు
  • 'ల‌య‌న్' సినిమాకు ఆస్కార్ నామినేష‌న్ పొందిన దేవ్‌
బాలీవుడ్‌లో బోల్డ్ పాత్ర‌ల‌కు మారుపేరుగా చెప్పుకుంటున్న రాధికా ఆప్టే, త్వ‌ర‌లో ఆస్కార్ నామినేటెడ్ న‌టుడి స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించ‌బోతోంది. 'స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్' ద్వారా పేరు సంపాదించుకుని, 'ల‌య‌న్' చిత్రానికి ఉత్తమ స‌హాయ న‌టుడిగా ఆస్కార్‌ నామినేషన్ సంపాదించిన‌ దేవ్ ప‌టేల్‌తో ఆమె న‌టించ‌నుంది.

ఈ విష‌యాన్ని తనే స్వ‌యంగా వెల్ల‌డించింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో ప్రకటిస్తామని పేర్కొంది. మరోపక్క, ఇప్ప‌టికే రాధిక న‌టించిన 'ప్యాడ్ మ్యాన్' చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా వుండగా, సైఫ్ అలీ ఖాన్‌తో 'బ‌జార్‌' అనే చిత్రంలోనూ రాధిక న‌టిస్తోంది.
raadhika
apte
oscar
dev patel

More Telugu News