వెంట్రుక వాసిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న వైనం.. వీడియో ఇదిగో!
- అమెరికాలోని టెక్సాస్‌లో ఘటన
- వణికిస్తోన్న మంచు తుపాను
- రోడ్లపైకి రావద్దంటోన్న పోలీసులు
తాజాగా అక్కడి రోడ్డుపై ఓ పోలీస్ ఆఫీసర్ నడుచుకుంటూ వెళుతూ జారిపడ్డాడు. అదే సమయంలో ఓ కారు వేగంగా పయనిస్తూ ఆయన పక్క నుంచే వెళ్లింది. క్షణాల వ్యవధిలో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్కడి పోలీసులు తమ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా ఇది వైరల్ అవుతోంది.. మీరూ చూడండి..