Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితుల్లో 'జబర్దస్త్'లో ఛాన్స్ వచ్చింది: శాంతి స్వరూప్

  • 'జబర్దస్త్'కి ముందు చాలా కష్టాల్లో వున్నాను 
  • చమ్మక్ చంద్ర తన టీమ్ లో ఛాన్స్ ఇచ్చాడు
  • ఈ షో నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది   
'జబర్దస్త్' స్టేజ్ పై లేడీ గెటప్స్ తో అలరించే నటుల్లో శాంతిస్వరూప్ ఒకరు. సన్నగా కనిపిస్తూ స్టేజ్ పై నవ్వుల సందడి చేసే శాంతిస్వరూప్, తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు. "కృష్ణా నగర్లో రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో .. స్నేహితులను రిక్వెస్ట్ చేసుకుని వాళ్ల రూములో ఉండేవాడిని. రెంట్ కట్టేవాడిని కాదు గనుక, అందులో వుండేవాళ్లకి వంటచేసి పెట్టడం .. బట్టలుతకడం .. రూమ్ శుభ్రంగా ఉంచడం చేసేవాడిని".

"ఒక రోజు తింటే ఒక రోజు తినని సందర్భాలు వున్నాయి. అలాంటి పరిస్థితుల్లో .. 'జబర్దస్త్'లో లేడీ గెటప్ వేసే ఆర్టిస్ట్ కావాలని రచ్చరవితో చమ్మక్ చంద్ర చెప్పాడట. అప్పటికే నాతో వున్న పరిచయం కారణంగా, రచ్చరవి నన్ను తీసుకెళ్లి చమ్మక్ చంద్రకి పరిచయం చేశాడు. ఆయన నాకు అవకాశం ఇచ్చాడు .. 'జబర్దస్త్'తో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు రూమ్ రెంట్ కి తీసుకుని ఉండగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.    
shanthi swaroop

More Telugu News