'టైగర్ నాగేశ్వర్ రావ్' పాత్రలో రానా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టైగర్ నాగేశ్వర్ రావ్' పాత్రలో రానా?

  • వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తోన్న రానా 
  • ఆయనను సంప్రదిస్తోన్న దర్శకుడు వంశీకృష్ణ 
  • నిర్మాతగా అనిల్ సుంకర  
హీరో పాత్రనా? .. విలన్ పాత్రనా? .. కీలకమైన మరో పాత్రనా? అనే తేడాలను రానా పక్కన పెట్టేశాడు. పాత్రలో కొత్తదనం ఉంటే చాలు .. తనకి విభిన్నంగా అనిపిస్తే చాలు ఒప్పేసుకుంటున్నాడు. నటనలో మరింత పరిణతిని చూపుతూ విజయాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం '1945' .. ' 'హాథీ మేరే సాథీ' సినిమాలను చేస్తోన్న రానా, మరో వైవిధ్యభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న దర్శకుడు వంశీకృష్ణ, 'టైగర్ నాగేశ్వర్ రావ్' జీవితచరిత్రను తెరకెక్కించనున్నాడు. ఒకప్పుడు గజదొంగలా మారి ..  రాబిన్ హుడ్ అనిపించుకున్న 'టైగర్ నాగేశ్వర్ రావ్' పాత్ర కోసం ఆయన రానాను సంప్రదిస్తున్నాడట. రానా ఓకే చెప్పే అవకాశం ఉందనీ .. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించనున్నారని చెబుతున్నారు.         
rana
vamsi krishna

More Telugu News