జైల్లో చలిగా ఉందన్న లాలూ... తబలా వాయించమని కౌంటర్ వేసిన న్యాయమూర్తి!
- పశుదాణా కేసులో దోషిగా లాలూ
- శిక్ష కోసం వేచి చూస్తున్న ఆర్జేడీ అధినేత
- కోర్టులో న్యాయమూర్తితో ఆసక్తికర సంభాషణ
- నేడు శిక్ష ఖరారయ్యే అవకాశం
"అలా అయితే తబలా వాయించు" అని ఆయన అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. తాను న్యాయవిద్యను కూడా అభ్యసించానని లాలూ ఈ సందర్భంగా వెల్లడించారు. వాస్తవానికి లాలూ సహా ఇతర దోషులకు 3వ తేదీన శిక్షలను ఖరారు చేయాల్సి వుండగా, అది వాయిదా పడుతూ వచ్చింది. నేడు లాలూ పరిస్థితులను బట్టి వ్యక్తిగతంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరవుతారని సమాచారం.