స్టోర్‌కి వెళ్లకుండానే మొబైల్ నెంబర్‌తో ఆధార్ లింక్.. కొత్త సౌకర్యాన్నిచ్చిన ప్రభుత్వం!
- కొత్త సదుపాయం ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- 14546 నెంబర్‌కి కాల్ చేస్తే చాలు
- వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా లింకింగ్ పూర్తి
అయితే మొబైల్ నంబర్ లింకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్త సదుపాయం ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ద్వారా స్టోర్లకి వెళ్లకుండానే ఆధార్‌ను అనుసంధానించే అవకాశం కలుగుతోంది. 14546 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేయవచ్చు. వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా ఈ అనుసంధానం జరుగుతుంది. ఆధార్ రీ-వెరిఫికేషన్‌లో భాగంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెంబర్‌కి కాల్ చేయగానే... మీరు భారతీయులా? కాదా? అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయాలి. వెంటనే ఆధార్‌లో నమోదు చేసిన మొబైల్ నెంబర్‌కి ఒక వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. అందుకే ఆధార్‌తో నమోదు చేయించిన మొబైల్‌ని దగ్గర పెట్టుకోవాలి. ఓటీపీ కన్ఫర్మ్ చేయగానే అనుసంధానం పూర్తవుతుంది.