'రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయిని చూడు' అంటోన్న హీరో తల్లి.. అలరిస్తోన్న రాజ్ తరుణ్ కొత్త సినిమా ట్రైలర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయిని చూడు' అంటోన్న హీరో తల్లి.. అలరిస్తోన్న రాజ్ తరుణ్ కొత్త సినిమా ట్రైలర్!

  • 'రంగుల రాట్నం' సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల
  • నాగార్జున నిర్మాతగా శ్రీ రంజని దర్శకత్వంలో 'రంగుల రాట్నం'
  • "ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు" అంటూ అద్భుతమైన డైలాగులు
శ్రీ రంజని దర్శకత్వంలో యువ నటులు రాజ్ తరుణ్, చిత్రా శుక్లా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న రంగుల రాట్నం సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ని చిత్ర నిర్మాత నాగార్జున త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. 'ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఉంది కదా, వెళ్లి ఆమెను బాగా చూడు' అంటూ హీరో తల్లి డైలాగ్ కొడుతోంది. తమ ఇంట్లో తాను, తన తల్లి మాత్రమే ఉంటామని హీరో అంటున్నాడు. 'ఇంత ఎండలో ఏంటి నీ రొమాన్సు' అంటూ హీరో తల్లి చెప్పిన మరో డైలాగ్ ను ఈ ట్రైలర్ ద్వారా వినిపించారు. అమ్మ చెప్పే మాటలు వినిపించుకోని హీరో ప్రేయసి చెప్పే మాటలను మాత్రం తప్పకుండా పాటిస్తున్నాడు. మీరూ చూడండి... 
Theatrical Trailer
RangulaRaatnam
raj tarun

More Telugu News