కాపు కులం పిచ్చితో కొట్టుకుంటున్న ‘జనసేన’, పవన్ కల్యాణ్ : మహేశ్ కత్తి తీవ్ర విమర్శలు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తి మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఏబీఎన్’ న్యూస్ ఛానెల్ లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ‘‘జనసేన’, పవన్ కల్యాణ్ కాపు కులం పిచ్చితో కొట్టుకుంటున్న, దళితులకు వ్యతిరేకంగా ఉన్న ఒక కులం పార్టీ ఇది. కాపు-కమ్మలను ఒకటి చేయడానికి పవన్ కల్యాణ్ అనే పవర్ బ్రోకర్ ఆడుతున్న నాటకమిది. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్..పవర్ బ్రోకర్. కుల అహంకారాన్ని నరనరాన జీర్ణించుకున్న పార్టీ ‘జనసేన’. రిజర్వేషన్లు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై పవన్ అభిమాని కల్యాణ్ దిలీప్ సుంకరకు తెలిసినంత కూడా పవన్ కల్యాణ్ కు తెలియదు’ అని మహేశ్ కత్తి విమర్శించారు.