నాకు కాబోయే భర్తకి ఇలాంటి అర్హతలు ఉండాలి: కేథరిన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు కాబోయే భర్తకి ఇలాంటి అర్హతలు ఉండాలి: కేథరిన్

  • కాబోయే భర్త హైట్ గా ఉండాలి
  • మంచి ఫిట్ గా ఉండాలి 
  • సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి  
తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న కేథరిన్ కి, 'కాబోయే భర్త ఎలా ఉండాలి?' అనే ప్రశ్న ఎదురైంది. 'ప్రభాస్ మాదిరిగా హైట్ ఉండాలా? మహేశ్ బాబులా తెల్లగా ఉండాలా? పవన్ కల్యాణ్ లా డైలాగ్స్ చెప్పాలా? అంటూ అలీ అడిగాడు.

అందుకామె స్పందిస్తూ .. "ఈ విషయంలో నా దగ్గర పెద్ద లిస్టే వుంది. లుక్స్ పరంగా చూసుకుంటే అబ్బాయి మంచి షూ వేయాలి. డీసెంట్ డ్రెస్ సెన్స్ వున్నవాడై ఉండాలి. కరెక్ట్ హైట్ తో .. ఫిట్ గా ఉండాలి. మంచి హెయిర్ స్టైల్ ఉండాలి. ఆకర్షణీయమైన కళ్లు .. కొంచెం షార్ప్ గా వుండే ముక్కు ఉండాలి. గుడ్ సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి' అని చెప్పుకొచ్చింది. ఇంకా చాలా వున్నాయి గానీ ..  ప్రస్తుతానికి ఇవి చాలు.. లేదంటే బోర్ కొట్టేస్తుంది' అనేసింది.
catherine
ali

More Telugu News